AP News: జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: జీవీఎల్
ABN , First Publish Date - 2022-08-18T00:12:18+05:30 IST
ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం జగన్ (CM Jagan) ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎంపీ జీవీఎల్ నరసింహరావు

విశాఖ: హామీలు నెరవేర్చని సీఎం జగన్ (CM Jagan) ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎంపీ జీవీఎల్ నరసింహరావు (GVL Narasimha Rao) డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో 22ఏ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. 15 రోజుల్లో పరిష్కరించకుంటే బాధితుల పక్షాన ఆందోళన చేపడతామని ప్రకటించారు. టీచర్లకే ఎందుకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ పెట్టారు? అని జీవీఎల్ ప్రశ్నించారు. మిగిలిన కార్యాలయాల్లో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. ప్రభుత్వ టీచర్లపై కక్ష సాధింపు చర్యలా ఉందన్నారు. చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (Chennai Industrial Corridor) ఎందుకు పూర్తి చేయలేదు? అని జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు.