జగన్‌ అరాచకపాలన చేస్తుంటే.. గవర్నర్‌కు సరిదిద్దే తీరికే లేదు: గోరంట్ల

ABN , First Publish Date - 2022-08-27T01:24:54+05:30 IST

రాష్ట్రంలో సీఎం జగన్‌ (CM Jagan) అరాచకపాలన చేస్తుంటే.. గవర్నర్‌ అసలు తీరికలేనట్టు వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి

జగన్‌ అరాచకపాలన చేస్తుంటే..  గవర్నర్‌కు సరిదిద్దే తీరికే లేదు: గోరంట్ల

రాజమహేంద్రవరం: రాష్ట్రంలో సీఎం జగన్‌ (CM Jagan) అరాచకపాలన చేస్తుంటే.. గవర్నర్‌ అసలు తీరికలేనట్టు వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి (Gorantla Butchaiah Chowdary) విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా తన ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే కేంద్రం కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్థానిక ఎన్నికల్లో భయపెట్టినట్టు, సార్వత్రిక ఎన్నికల్లో కూడా భయపెట్టాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో ప్రజల చేత, ప్రజల మధ్య ఓటుతో వైసీపీ (YCP)ని సజీవ సమాధి చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గోరంట్ల బుచ్చయ్యచౌదరి హెచ్చరించారు. 

Read more