CM Jagan: ఎన్టీఆర్ పేరు మార్పుపై ముఖ్యమంత్రి ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-09-21T20:22:08+05:30 IST

ఎన్టీఆర్ పేరు మార్పుపై అనేక సార్లు ప్రశ్నించుకున్నానని సీఎం జగన్ అన్నారు.

CM Jagan: ఎన్టీఆర్ పేరు మార్పుపై ముఖ్యమంత్రి ఏమన్నారంటే..

అమరావతి (Amaravathi): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (NTR Health University) పేరు మార్పుపై అనేక సార్లు ప్రశ్నించుకున్నానని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. దీనిపై బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు తెచ్చే ముందు అనేక సార్లు ప్రశ్నించుకున్నానని... చివరకు తాను చేస్తుంది కరెక్టే అని భావించాకే అడుగులు ముందుకు వేశాననని.. వైఎస్సార్ (YSR) పేరుపెట్టాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. 108, 104, ఆరోగ్యశ్రీ అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ అని... ఆయన వృత్తిపరంగా కూడా డాక్టర్ అని తెలిపారు. ఏపీలో అమలవుతున్న ఈ పథకాలన్నింటికి సృష్టి కర్త వైఎస్సార్ అని సీఎం జగన్ చెప్పారు.


జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చేయాలని వైసీపీ సర్కారు నిర్ణయించుకుంది. ఎన్టీఆర్‌ పేరు తీసేసి... ‘వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ’గా మార్చాలని తీర్మానించుకుంది. ఇందుకు వీలుగా యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తూ ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు తయారుచేసింది. మంగళవారం రాత్రి హడావుడిగా ఆన్‌లైన్‌లో మంత్రులకు ఈ సవరణలను పంపి, కేబినెట్‌ అనుమతి కూడా తీసుకుంది.

Updated Date - 2022-09-21T20:22:08+05:30 IST