చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారు: గిడుగుChiranjeevi remains in Congress: Gidugu

ABN , First Publish Date - 2022-12-31T04:59:15+05:30 IST

Chiranjeevi remains in Congress: Gidugu

చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారు: గిడుగుChiranjeevi remains in Congress: Gidugu

రాజమహేంద్రవరం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్‌ వాదిగానే ఉంటానని చెప్పారు. సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడంలేదు’’ అని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. ‘‘వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫొటోను మా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటాం. కాంగ్రెస్‌ అధిష్ఠానం మేనిఫెస్టోతో పాటు రాజశేఖరరెడ్డి చేసిన కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటాం. మా పార్టీ ప్రధాన శత్రువు వైఎస్‌ జగన్మోహనరెడ్డి. వచ్చే నెల 26 నుంచి మార్చి 26 తేదీ వరకూ ప్రజాపోరు నిర్వహిస్తాం’’ అని అన్నారు.

Updated Date - 2022-12-31T04:59:28+05:30 IST

Read more