Chikoti Praveen: చికోటి ప్రవీణ్ చీకటి చరిత్ర వెనుక వైసీపీ పెద్దలున్నారు: కొనకళ్ల నారాయణ

ABN , First Publish Date - 2022-07-30T22:58:45+05:30 IST

చికోటి ప్రవీణ్ చీకటి చరిత్ర వెనుక వైసీపీ పెద్దలున్నారని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో

Chikoti Praveen: చికోటి ప్రవీణ్ చీకటి చరిత్ర వెనుక వైసీపీ పెద్దలున్నారు: కొనకళ్ల నారాయణ

అమరావతి: చికోటి ప్రవీణ్ చీకటి చరిత్ర వెనుక వైసీపీ పెద్దలున్నారని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చికోటి ప్రవీణ్‌ను గుడివాడకు తీసుకొచ్చిందెవరు?.. క్యాసినోకు నిధులు సమకూర్చిందెవరు? అని ప్రశ్నించారు. గుడివాడ క్యాసినోపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. చికోటి ప్రవీణ్ సీఎం జగన్‌కు ఎంత వాటా ఇచ్చారో తేలాలని డిమాండ్ చేశారు. అనుమతి లేని చోట్ల క్యాసినో ఎలా నిర్వహించారో ఈడీ తెలపాలని కొనకళ్ల నారాయణ డిమాండ్ చేశారు.

Read more