-
-
Home » Andhra Pradesh » Chief Justices of Supreme and High Courts-NGTS-AndhraPradesh
-
శ్రీవారి సేవలో సుప్రీం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు
ABN , First Publish Date - 2022-10-02T09:38:12+05:30 IST
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. మఽధ్యాహ్నం మూడు గంటలకు ఆలయంలోకి వెళ్లిశ్రీవారిని

తిరుమల, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆలయంలోకి వెళ్లిశ్రీవారిని దర్శించుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయయూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా కూడా శ్రీవారిని ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.రాజాతో కలసి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.