మోదీ సూచన మేరకు మరికాసేపట్లో నీతి ఆయోగ్ సీఈఓతో చంద్రబాబు భేటీ..
ABN , First Publish Date - 2022-12-06T12:43:51+05:30 IST
జీ-20 సమావేశంపై నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్‌తో మాట్లాడాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని మోదీ సూచించారు.
Chandrababu meeting with Niti Aayog CEO : జీ-20 సమావేశంపై నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్‌తో మాట్లాడాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని మోదీ సూచించారు. ఈ సూచన మేరకు మరికాసేపట్లో నీతి ఆయోగ్ సీఈవోతో చంద్రబాబు భేటీ కానున్నారు. జీ-20పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని తన ప్రసంగంలో మోదీ ప్రస్తావించారు. ఈ క్రమంలోనే డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్‌పై నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు సూచించారు. భారత దేశ భవిష్యత్ ప్రయాణంపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలో భారత్ నంబర్ వన్ దేశంగా అవతరిస్తుందన్నారు. యువ శక్తి మన దేశానికి ఉన్న బలమన్నారు. వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన చేయాలన్నారు. దేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని, నాలెడ్జ్ ఎకానమీతో అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయని చంద్రబాబు సూచించారు.