జగన్‌కు చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2022-04-23T21:27:36+05:30 IST

సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలపై

జగన్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలపై చంద్రబాబు లేఖ రాశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలపై హింస పెరిగేందుకు ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమన్నారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని తప్పుబట్టారు. విజయవాడ ఆస్పత్రిలో అత్యాచారమే దీనికి సాక్ష్యమని తెలిపారు. కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు చెప్పినా పట్టించుకోలేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-04-23T21:27:36+05:30 IST