-
-
Home » Andhra Pradesh » CHANDRABABU FIRES ON CM JAGAN YCP GOVT VK-MRGS-AndhraPradesh
-
TDP: జగన్‌రెడ్డి ఎక్కువ రోజులు ఏపీలో ఉండలేక పారిపోతాడు: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-07-22T22:43:00+05:30 IST
సీఎం జగన్‌రెడ్డి ఎక్కువ రోజులు ఏపీలో ఉండలేక పారిపోతాడని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు.

అమరావతి: సీఎం జగన్‌రెడ్డి (CM JAGAN) ఎక్కువ రోజులు ఏపీలో ఉండలేక పారిపోతాడని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(CHANDRABABU) అన్నారు. శుక్రవారం అబ్బిరాజుపాలెంలో వరద ముంపు బాధితులను పరామర్శించారు. జోరు వర్షంలోనూ కాలినడకన వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ(YCP).. దొంగ ప్రభుత్వం ప్రజల ఆస్తులను కొట్టేసేందుకూ వెనకాడదన్నారు.జగన్‌రెడ్డి పిడిగుద్దులతో ప్రజలకు నరకం చూపిస్తున్నారన్నారు. ఇసుక మాఫియా(Sand Mafia)ను ప్రోత్సహిస్తూ మత్యకారుల జీవనోపాధిని దెబ్బతీశారని మండిపడ్డారు. ద్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసి మహిళలను ఆర్థికంగా దెబ్బతీశారన్నారు. జగన్ మీటింగ్‌ల కోసం జనం కనిపించాలని ద్వాక్రా సంఘాలను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. బాదుడే బాదుడుతో నిత్యావసరాలు పెంచి మళ్లీ కట్టెల పొయిలను వాడేలా సీఎం జగన్‌రెడ్డి చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
యలమంచలి మండలంలో..
పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన యలమంచలి మండలం లక్ష్మీపాలెం గ్రామం, గంగలపాలెంలోనూ చంద్రబాబు శుక్రవారం పర్యటించారు. రహదారి, రవాణా అంతంత మాత్రంగా ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సాగుతుంది. లక్ష్మీపాలెంలో ట్రాక్టర్‌పై వెళ్లి గ్రామంలో బాధితులను పరామర్శించారు.చంద్రబాబు రాకతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం వరకూ వరద నీటిలోనే తాము ఉండాల్సి వచ్చిందని, ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని గ్రామస్తులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.