Chandra Babu: ప్రాణాలు అడ్డుపెట్టయినా కాపాడుకుంటా
ABN , First Publish Date - 2022-12-31T18:43:52+05:30 IST
Prakasham: టీడీపీ(TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) జగన్ (CM Jagan) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కందుకూరు ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు సభకు
Prakasham: టీడీపీ(TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) జగన్ (CM Jagan) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కందుకూరు ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు సభకు వేలాది మంది టీడీపీ కార్యకర్తలు వస్తారని తెలిసి కూడా రక్షణ కల్పించలేదని ఆరోపించారు. కొండపి మండలం పెట్లూరులో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తమ వంతు బాధ్యతగా మృతుల ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలు ప్రకటించామని చెప్పారు. కందుకూరు సభ పెట్టిన ప్రాంతంలో గతంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్, సినీ నటులు కూడా బహిరంగ సభలు పెట్టారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ స్పందించిన తరువాత జగన్ స్పందించాడు. 8 మంది టీడీపీ కార్యకర్తల్ని కోల్పోయి బాధలో ఉంటే పుండుమీద కారం చల్లినట్టు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని, పార్టీ కోసం పని చేసే వారిని నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటాను. హుదూద్ తుఫాన్ సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేశాం.10 రోజులు విశాఖ లోనే ఉండి బాధ్యత గా పని చేశానని గుర్తు చేశారు. రాజేశ్వరి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునే బాధ్యత టీడీపీదేనన్నారు.