Sujana chowdary: ఏపీ రాజధానిపై 2014లోనే నిర్ణయం

ABN , First Publish Date - 2022-09-18T18:23:44+05:30 IST

భారత రాజ్యాంగం ప్రకారం విభజన చట్టం అమలు చేయడం జరిగిందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తెలిపారు.

Sujana chowdary: ఏపీ రాజధానిపై 2014లోనే నిర్ణయం

ప్రకాశం: భారత రాజ్యాంగం ప్రకారం విభజన చట్టం అమలు చేయడం జరిగిందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి (Sujana chowdary) తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని(AP Capital) ఎక్కడ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాని(AP Government)కి నిర్ణయం తీసుకునే అధికారం ఉందన్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలనేది 2014లోనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మార్చాలంటే కరెక్ట్ కాదన్నారు. తల కిందకి కాళ్లు పైకి పెట్టి జపం చేసినా అమరావతి రాజధానిగా ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. రాజధానులు మూడు పెడతాం... 30 పెడతామంటే కుదరదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు సరిగ్గా వాడుకుంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని తెలిపారు. ఏపీలో ఇసుక, మైనింగ్, లిక్కర్, ల్యాండ్ మాఫియాలు నడుస్తున్నాయి. ఏపీలో లిక్కర్ స్కామ్‌లు త్వరలోనే బయటకు వస్తాయని సుజనా చౌదరి వెల్లడించారు. 

Updated Date - 2022-09-18T18:23:44+05:30 IST