సీఎం ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరు: మంత్రి కన్నబాబు
ABN , First Publish Date - 2022-03-16T21:47:04+05:30 IST
ఎన్ని ఆరోపణలు చేసినా ముఖ్యమంత్రి జగన్ ఆత్మస్థైర్యాన్ని

అమరావతి: ఎన్ని ఆరోపణలు చేసినా ముఖ్యమంత్రి జగన్ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బ తీయలేరని మంత్రి కన్నబాబు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. సభ ప్రారంభం నుంచే టీడీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిరోజే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని అవమానించారని ఆయన మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలను టీడీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. గోదావరి పుష్కరాలు, ఏర్పేడు ఘటనలో కుటుంబాలను చంద్రబాబు పరామర్శించ లేదు, పరిహారం చెల్లించలేదని ఆయన విమర్శించారు. జరగని సంఘటనపై లోకేష్ జ్యుడీషియల్ ఎంక్వైరీ కోరుతున్నాడన్నారు. లేనిపోనివి సీఎం పై ఆరోపిస్తున్నారని ఆయన మండిపడ్డారు.