దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు

ABN , First Publish Date - 2022-10-04T07:36:25+05:30 IST

దసరా పండుగ రోజున దుర్గామల్లేశ్వరస్వామికి నిర్వహించే తెప్పోత్సవాన్ని రద్దుచేశారు. పులిచింతల నుంచి

దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు

దసరా పండుగ రోజున దుర్గామల్లేశ్వరస్వామికి నిర్వహించే తెప్పోత్సవాన్ని రద్దుచేశారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌కి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి లక్ష  క్యూసెక్కుల వరకు నీరు వస్తోంది. ఇన్‌ఫ్లో తగ్గకపోవడంతో నిరభ్యంతరపత్రం ఇవ్వలేమని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. దీంతో తెప్పోత్సవం నిర్వహణ కష్టమన్న నిర్ణయానికి ఉత్సవాల కమిటీ వచ్చింది.  

Read more