175 సీట్లకు పోటీ చేయగలరా?

ABN , First Publish Date - 2022-08-16T09:57:19+05:30 IST

‘రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీట్లకు, 25 పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేయగలరా?’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు.

175 సీట్లకు పోటీ చేయగలరా?

పవన్‌ కల్యాణ్‌... టీడీపీ నుంచి మీకు స్వాతంత్య్రం వచ్చిందా?: మంత్రి అమర్‌నాథ్‌

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 15: ‘రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీట్లకు, 25 పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేయగలరా?’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే సహించేది లేదు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబుకు మేలు చేయడానికి తాపత్రయ పడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా పవన్‌ మీకు టీడీపీ నుంచి స్వాతంత్య్రం రాలేదా?’’ అని అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. 

Read more