బ్రోకర్ రాజకీయాలు నాకు తెలియదు: బైరెడ్డి సిద్దార్థ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-22T21:54:37+05:30 IST

పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు వాయిదా

బ్రోకర్ రాజకీయాలు నాకు తెలియదు: బైరెడ్డి సిద్దార్థ రెడ్డి

నంద్యాల: పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు వాయిదా వల్ల తిరుపతిలో శాప్ సమీక్షకు హాజరుకాలేదన్నారు. పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తున్నానని, తనకు బ్రోకర్ రాజకీయాలు తెలియవన్నారు. కుటిల రాజకీయాలు ఎలాఉంటాయో ఈవారంలో తెలుసుకున్నానని తెలిపారు. నందికొట్కూరు, పగిడ్యాలలో షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నందికొట్కూరులో పనులు తగ్గించామన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్‌ది స్ధానిక ప్రోటోకాల్.. తనది రాష్ట్ర ప్రోటోకాల్.. అందుకే ఇద్దరం కలవలేకపోతున్నామని చెప్పారు. తన  ప్రోటోకాల్ పరిధిలోని కార్యక్రమాల్లో పాల్గొంటానని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-04-22T21:54:37+05:30 IST