జిల్లాల విభజనలో కూడా జగన్‌కు షాక్ తగులుతుంది: బైరెడ్డి

ABN , First Publish Date - 2022-03-05T19:51:10+05:30 IST

శ్రీకృష్ణదేవరాయ ధర్నా చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రజా నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..

జిల్లాల విభజనలో కూడా జగన్‌కు షాక్ తగులుతుంది: బైరెడ్డి

కర్నూలు : శ్రీకృష్ణదేవరాయ ధర్నా చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రజా నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. డోన్, ఆదోనిని జిల్లాలుగా చేయాలని.. నందికొట్కూరును కర్నూలు జిల్లాలో చేర్చాలన్నారు. పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో కలపాలన్నారు. మూడు రాజధానుల తీర్పు మాదిరిగానే జిల్లాల విభజన వల్ల కూడా జగన్‌కు షాక్ తగులుతుందని బైరెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలే జగన్‌ను పాతాళానికి తీసుకెళ్తాయన్నారు. వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని... కేవలం గడ్డ మాత్రమే మిగిలిందన్నారు. అమరావతిపైన హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం తగదని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.Read more