వెయ్యి తప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: బొండా ఉమా

ABN , First Publish Date - 2022-03-13T02:18:49+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వెయ్యిరోజుల పాలనలో వెయ్యి తప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ

వెయ్యి తప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: బొండా ఉమా

విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వెయ్యిరోజుల పాలనలో వెయ్యి తప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.  ఎన్నికల ముందు జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత రాక్షస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి లేక పరిశ్రమలు రాక నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారని తెలిపారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, అమ్మఒడిని అటకెక్కించారని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇలా అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2022-03-13T02:18:49+05:30 IST