విజయవాడ: అత్యాచార బాధితురాలి కుటుంబానికి టీడీపీ ఆర్ధిక సాయం

ABN , First Publish Date - 2022-04-27T17:31:04+05:30 IST

విజయవాడ: అత్యాచార బాధితురాలి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఆర్ధిక సాయం చేసింది.

విజయవాడ: అత్యాచార బాధితురాలి కుటుంబానికి టీడీపీ ఆర్ధిక సాయం

విజయవాడ: అత్యాచార బాధితురాలి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఆర్ధిక సాయం చేసింది. టీడీపీ తరపున ఆ పార్టీ నేత బోండా ఉమ, వంగలపూడి అనిత రూ.5 లక్షలు అందజేశారు. ఈ సందర్బంగా బోండా ఉమ మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తాము బాధిత కుటుంబానికి అండగా ఉంటే నోటీసులిచ్చారని మండిపడ్డారు. మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు మహిళా కమిషన్‌ అధికారాలు, హక్కులు వాసిరెడ్డి పద్మకు తెలుసా? అని ప్రశ్నించారు. అనర్హత కలిగిన వ్యక్తి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారని, ఆమె రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాసిరెడ్డి పద్మను పదవి నుంచి తప్పించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.


వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆడబిడ్డ జీవితంతో ప్రభుత్వం, వాసిరెడ్డి పద్మ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ కోణంలోనే టీడీపీ నేతలకు నోటీసులిచ్చారని మండిపడ్డారు. తాము బాధితురాలితో కలిసి మహిళా కమిషన్ ఆఫీస్‌కి వస్తామని, వాసిరెడ్డి పద్మకు చిత్తశుద్ధి ఉంటే తమతో చర్చించాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-27T17:31:04+05:30 IST