వివేకా కేసు నిందితులే సీబీఐని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: బోండా ఉమ

ABN , First Publish Date - 2022-02-19T19:44:40+05:30 IST

వివేకా హత్య కేసు నిందితులే సీబీఐని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ పేర్కొన్నారు.

వివేకా కేసు నిందితులే సీబీఐని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: బోండా ఉమ

అమరావతి : వివేకా హత్య కేసు నిందితులే సీబీఐని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ పేర్కొన్నారు. వివేకా హత్య.. అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చేసిందేనని.. సీబీఐ స్పష్టంగా కోర్టుకు తెలిపిందన్నారు. వివేకా హత్యను గుండెపోటు అన్నామని వైసీపీ ఒప్పుకుంటోందన్నారు. హత్యను గుండెపోటు అని ఎలా అంటారని బోండా ఉమ ప్రశ్నించారు. సాక్ష్యాలను తారుమారు చేశామని వైసీపీనే చెబుతోందన్నారు. సీఎం జగన్ మార్చి 19, 2019న సీబీఐ విచారణ కావాలని హైకోర్టుకు వెళ్లారన్నారు. సీఎం అవ్వగానే ఫిబ్రవరి 6, 2020న కేసు వెనక్కి తీసుకున్నారన్నారు. కేసు వెనక్కి తీసుకున్నది అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు కాదా? అని బోండా ఉమ ప్రశ్నించారు. 

Read more