బీజేపీ విజయం.. ప్రజా విజయం: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-03-10T20:52:45+05:30 IST

యూపీ, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యత కనబర్చింది.

బీజేపీ విజయం.. ప్రజా విజయం: సోము వీర్రాజు

విజయవాడ: యూపీ, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యత కనబర్చింది. దాదాపుగా ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. బీజేపీ విజయఢంకా మోగించడంతో కాషాయ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో రాష్ట్ర బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు. నాయకులు స్వీట్లు పంచుతూ అభినందనలు తెలుపుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, పలువురు నాయకులు సంబరాలలో పాల్గొన్నారు. రాజధాని రైతులు... సోము వీర్రాజును‌ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విజయం.. ప్రజా విజయమని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఏపీలో కూడా ఇదే రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. 

Updated Date - 2022-03-10T20:52:45+05:30 IST