త్వరలో పాదయాత్రలు: సోము

ABN , First Publish Date - 2022-12-31T05:02:56+05:30 IST

రాష్ట్రంలోని 13 వేల గ్రామాల్లో పది వేల కిలోమీటర్ల మేర పాదయాత్రలు నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.

త్వరలో పాదయాత్రలు: సోము

విశాఖపట్నం, డిసెంబరు 30: రాష్ట్రంలోని 13 వేల గ్రామాల్లో పది వేల కిలోమీటర్ల మేర పాదయాత్రలు నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ఈ కార్యక్రమం షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సి ఉందన్నారు. నగరంలో శనివారం నిర్వహించిన బీజేపీ విశాఖ జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీసీల హక్కులను జగన్‌ కాలరాశారన్నారు. వచ్చే నెల 8న కర్నూలు, హిందూపురంలలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటిస్తారని తెలిపారు. కాగా, కందుకూరు దుర్ఘటన బాధాకరమని సోము వీర్రాజు అన్నారు. సభలు జరిగే తీరు తెన్నుల పరిశీలన బాధ్యత పోలీసులదేనన్నారు.

Updated Date - 2022-12-31T05:03:40+05:30 IST

Read more