త్వరలో బీజేపీ పాదయాత్ర: సోమువీర్రాజు
ABN , First Publish Date - 2022-03-16T21:10:15+05:30 IST
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి త్వరలో

విజయనగరం: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం త్వరలో బీజేపీ పాదయాత్ర చేపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు. ఇక్కడ మీడయాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేదన్నారు. ప్రభుత్వ ఆలోచనతో రైతులు సతమతమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీ కలిసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆయన ఆరోపించారు.