AP: సోమువీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు
ABN , First Publish Date - 2022-01-04T14:18:45+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు అయ్యింది.

ఏలూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు అయ్యింది. తమ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్బీఐ బ్యాంకులో కవల వెంకట నరసింహం లోన్ తీసుకున్నారని రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవ్వూరు టౌన్ పోలీస్స్టేషన్లో గత నెల 4న జయరామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమువీర్రాజు అల్లుడు వెంకట నరసింహంపై ఐపీసీ 406, 419, 420, 465 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.