Somuveerraju comments: ప్రపంచాన్ని శాశించే విజ్ఞానం ఆంధ్రా ప్రజల సొంతం
ABN , First Publish Date - 2022-08-15T18:42:58+05:30 IST
ఆంధ్రా ప్రజలు ప్రపంచాన్ని శాశించే విజ్ఞానం వారి సొంతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు.

అమరావతి: ఆంధ్రా ప్రజలు ప్రపంచాన్ని శాశించే విజ్ఞానం వారి సొంతమని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (Somu veerraju) అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమువీర్రాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... జైజవాన్, జై కిసాన్ , జై విజ్ఞాన్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నా రాష్ట్రంలో పరిస్థితి అధ్వాన్నంగా మారిందని తెలిపారు. భవిష్యత్లో బంగారు ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) నిర్మాణం చేద్దామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో నవ నిర్మాణం జరగాలని... రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం జరగాలని అన్నారు. మత్స్యకారులు సముద్ర గర్భంలో జాతీయ పతాకం (National flag) ఎగురవేశారని తెలిపారు. మన మత్స్యకారుల మూలంగా 40 శాతం మత్స్య సంపదను విదేశాలకు ఎగుమతి అవుతుందన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్స్ పూర్తయితే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. వాజ్ పేయ్ (Vajpayee) ఆశయాలను మోదీ (PM Narendra modi) ముందుకు తీసుకెళ్తున్నారని సోమువీర్రాజు పేర్కొన్నారు.