పీఎస్‌ఎల్‌వీ సీ52 ప్రయోగం విజయవంతం అభినందనీయం: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-02-14T18:13:49+05:30 IST

పీఎస్‌ఎల్‌వీ సీ52 ప్రయోగం విజయవంతం అభినందనీయమని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు.

పీఎస్‌ఎల్‌వీ సీ52 ప్రయోగం విజయవంతం అభినందనీయం: సోము వీర్రాజు

అమరావతి: పీఎస్‌ఎల్‌వీ సీ52 ప్రయోగం విజయవంతం అభినందనీయమని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి దీన్ని చేపట్టారని తెలిపారు. 25.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం ఈరోజు ఉదయం 5:59 గంటలకు వాహకనౌక ఆర్‌ఐశాట్‌-1, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిందన్నారు. 2022లో ఇదే తొలి ప్రయోగమని... ఇస్రోకు 2022లో ఇదే మొదటి ప్రయోగమన్నారు. అంతేకాకుండా ఇస్రో అధిపతిగా ఇటీవల నియామకమైన డాక్టర్‌ సోమనాథ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన తొలి ప్రయోగం ఇది అని సోమువీర్రాజు పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-14T18:13:49+05:30 IST