కృష్ణా జిల్లాలో బీజేపీ నాయకుడు దారుణ హత్య

ABN , First Publish Date - 2022-02-19T16:45:07+05:30 IST

జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని వత్సవాయి మండలంలో దారుణ హత్య జరిగింది. చిట్యాల గ్రామంలో బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు

కృష్ణా జిల్లాలో బీజేపీ నాయకుడు దారుణ హత్య

కృష్ణా: జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని వత్సవాయి మండలంలో దారుణ హత్య జరిగింది. చిట్యాల గ్రామంలో బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు నిన్న (శుక్రవారం) అర్థరాత్రి హత్య చేశారు. వత్సవాయి మండల కేంద్రంలో పని చూసుకొని రాత్రి ఇంటికి తిరిగివస్తుండగా మాటు వేసి మల్లారెడ్డిని దుండగులు హతమార్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more