Kanna laxminarayana comments: రెండేళ్లలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలి
ABN , First Publish Date - 2022-07-30T16:46:58+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy)పై బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxmi narayana) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy)పై బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxmi narayana) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఉదయం ఎర్రబాలెం నుండి ప్రారంభం అయిన బీజేపీ మనం... మన అమరావతి యాత్రలో కన్నా పాల్గొని ప్రసంగించారు. ఒక్క అవకాశం ఇవ్వండి.. ఆకాశాన్ని దింపి నేలమీదకు తెస్తానని జగన్ అన్నారని గుర్తు చేశారు. అమరావతిలో ఏమీ లేదని అంటూ.. దోచుకోవడానికే జగన్ అభిప్రాయమని ఆనాడే చెప్పానని తెలిపారు. ఇప్పుడు అదే జరుగుతోందని.. విశాఖలో ప్రైవేట్ ఆస్తులను కబ్జా చేస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘‘జగన్‌కు చెపుతున్నా...ఇప్పటికైనా రెండేళ్లలో రాజధాని అమరావతిలో ఉంటుందని చెప్పి అభివృద్ది చేయాలి’’ అని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.