మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి: Kanna

ABN , First Publish Date - 2022-06-03T19:19:40+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ(Kanna laxminarayana) అన్నారు.

మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి: Kanna

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ(Kanna laxminarayana) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... దేశ రక్షణలో రాజీ లేదని.. పాక్, చైనాలకు ధీటుగా జవాబు చెప్పారని తెలిపారు. పేదరిక నిర్మూలన మోదీ ఆచరణలో చూపారన్నారు. ప్రజా వైద్యం విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని అన్నారు. ఆత్మనిర్బర్ భారత్ కింద 20 లక్లల కోట్లు ప్యాకేజీగా ఇచ్చారన్నారు. పెట్రో ధరల భారం ప్రజలకు పడకుండా పన్నులు తగ్గించారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. Updated Date - 2022-06-03T19:19:40+05:30 IST