మాది చంద్రబాబు తోకపార్టీ కాదు: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-01-26T01:25:17+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు తోక పట్టుకొని వేళాడే పార్టీ తమది కాదని

మాది చంద్రబాబు తోకపార్టీ కాదు: సోము వీర్రాజు

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు తోక పట్టుకొని వేళాడే పార్టీ తమది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. తమపై విమర్శలు చేస్తే గట్టిగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. మంత్రి కొడాలి నానికి మైండ్ పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఒకే వేదిక మీద నాతో కొడాలి నాని మాట్లాడితే ఎవరేమిటో తెలుస్తుందని ఆయన సవాల్ విసిరారు. ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్డుకునే వాళ్లు తమపైన విమర్శలు చేయడమా అని ఆయన నిలదీశారు. సంక్రాంతి సంబరాలు అంటే తెలియజెప్పాలనుకున్నామన్నారు. తాము ప్రచారం కోసం రాలేదన్నారు. గోవా వాళ్ళతో ప్రచారం చేసుకుంది వైసీపీ ప్రభుత్వమేనని ఆయన మండిపడ్డారు. పోలీసులపై ప్రభుత్వ ఒత్తిడి ఉందని ఆయన పేర్కొ్న్నారు. 

Updated Date - 2022-01-26T01:25:17+05:30 IST