-
-
Home » Andhra Pradesh » Bhramaramba Devi in real form-NGTS-AndhraPradesh
-
నిజరూపంలో భ్రమరాంబాదేవి
ABN , First Publish Date - 2022-10-07T08:00:53+05:30 IST
నిజరూపంలో భ్రమరాంబాదేవి

శ్రీశైలం, అక్టోబరు 6: దసరా మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. అమ్మవారికి భ్రమరాంబికాదేవిగా నిజరూపాలంకరణ చేశారు. స్వామిఅమ్మవార్లకు నంది వాహనసేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను పుష్పాలతో ప్ర త్యేకంగా అలంకరించి విశేషపూజలు జరిపా రు. సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద చేపట్టిన తెప్పోత్సవం భక్తులను ఆకట్టుకుంది. అమ్మవారి యాగశాలలో చండీయాగ పూర్ణాహుతి, రుద్రయాగపూర్ణాహుతి కార్యక్రమాలు చేశారు.