ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షల విరమణ

ABN , First Publish Date - 2022-12-15T03:20:31+05:30 IST

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దీక్ష విరమణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతోంది.

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షల విరమణ

విజయవాడ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దీక్ష విరమణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ నెల 19వ తేదీ వరకు భవానీ దీక్ష చేపట్టిన భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తారు. వారంతా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాల విరమణ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిసా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపుగా 7లక్షల మంది భవానీ దీక్ష చేపట్టిన భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తారని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ అధికారులు అంచనా వేశారు. 19వ తేదీన జరిగే పూర్ణాహుతితో మాల విరమణ ప్రక్రియ పూర్తవుతుంది.

Updated Date - 2022-12-15T03:20:32+05:30 IST