ఢిల్లీలో బీసీ సంఘం ధర్నా
ABN , First Publish Date - 2022-12-15T03:53:13+05:30 IST
‘పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి’’ అని జాతీయ బీసీ సంఘం డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘‘పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి’’ అని జాతీయ బీసీ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం ఆ సంఘం ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యు డు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. ‘‘75 కోట్ల మంది జనాభా గల బీసీలను బిచ్చగాళ్లను చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టే వరకు బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం. పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకోకపోతే దేశంలో తిరుగుబాటు జరుగుతుంది’’ అని కృష్ణయ్య హెచ్చరించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి అవలంభిస్తోందన్నారు.