perni nani: జనవరిలో బందరు పోర్టు పనులు
ABN , First Publish Date - 2022-11-09T04:14:38+05:30 IST
బందరు పోర్టుకు పర్యావరణ అనుమతులు పొంది వచ్చే జనవరిలో పనులు ప్రారంభిస్తామని మచిలీపట్నం ఎమ్మెల్యేపేర్ని నాని చెప్పారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు.
మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని
అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): బందరు పోర్టుకు పర్యావరణ అనుమతులు పొంది వచ్చే జనవరిలో పనులు ప్రారంభిస్తామని మచిలీపట్నం ఎమ్మెల్యేపేర్ని నాని చెప్పారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. బందరు పోర్టుపై టీడీపీ నేతలు విచిత్ర ప్రకటనలు చేస్తున్నారని, టీడీపీ హయాంలో శంకుస్థాపన చేస్తే, పోర్టు నిర్మాణం చేసినట్లు కాదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో టెండర్లు దక్కించుకున్న నవయుగ సంస్థ శంకుస్థాపనతోనే సరిపెట్టిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే ముందు టీడీపీ నేత కొల్లు రవీంద్ర అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు.