బాలు విగ్రహాన్ని పునరుద్ధరించాలి: టీడీపీ
ABN , First Publish Date - 2022-10-07T08:50:49+05:30 IST
బాలు విగ్రహాన్ని పునరుద్ధరించాలి: టీడీపీ
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ప్రభుత్వమే పునరుద్ధరించాలని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ డిమాండ్ చేశారు. గుంటూరు మదర్ థెరిస్సా సెంటరులో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదంటూ తొలగించి.. మరుగుదొడ్డి వద్ద పెట్టడం ఆ మహనీయుడిని ఘోరంగా అవమానించడం కాదా? అని ప్రశ్నించారు. ‘‘బడుగు వర్గాల కోసం పాటుపడిన బీపీ మండల్ విగ్రహాన్ని కూడా ఇలాగే తొలగించారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం సంగీతాభిమానులు, కళాకారుల హృదయాల్ని గాయపరిచేలా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వేలకొద్దీ ఏర్పాటు చేసిన రాజశేఖరరెడ్డి విగ్రహాలన్నింటికీ అనుమతులు ఉన్నాయా?’’ అని రఫీ నిలదీశారు.