వైసీపీ నేత హత్య కేసులో నిందితులకు బెయిల్‌

ABN , First Publish Date - 2022-08-10T09:51:52+05:30 IST

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత గంజి ప్రసాద్‌ కేసులో ఎనిమిది మంది నిందితులకు మంగళవారం బెయిల్‌ మంజూరైంది.

వైసీపీ నేత హత్య కేసులో నిందితులకు బెయిల్‌

ద్వారకాతిరుమల, ఆగస్టు 9 : ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో  హత్యకు గురైన వైసీపీ నేత గంజి ప్రసాద్‌ కేసులో ఎనిమిది మంది నిందితులకు మంగళవారం బెయిల్‌ మంజూరైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న వర్గపోరులో గంజి ప్రసాద్‌ ను నడిరోడ్డుపై అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ కేసులో పది మంది నిందితులను అరెస్ట్‌ చేయగా సోమవారం ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎనిమిది మందికి బెయిల్‌ మంజూరు చేశారు.  కాగా తమకు ప్రాణహాని ఉందని, బెయిల్‌పై విడుదలైన వారు గ్రామంలోకి రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు విన్నవించినట్లు హతుడు ప్రసాద్‌ భార్య సత్యవతి తెలిపారు.

Read more