ఆ చారలు చూసుకుని Vijayasai పులిగా ఫీల్ అవ్వడంలో తప్పు లేదు: Ayyanna
ABN , First Publish Date - 2022-06-25T16:34:49+05:30 IST
ట్విట్టర్(Twitter) వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(Vijayasai Reddy)కి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు(Ayyannapatrudu) దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

అమరావతి : ట్విట్టర్(Twitter) వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(Vijayasai Reddy)కి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు(Ayyannapatrudu) దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. 16 నెలల పాటు చిప్పకూడు తినడం వలన శరీరం మందపడిందన్నారు. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడిన చారలు చూసుకొని విజయ సాయిరెడ్డి పులిగా ఫీల్ అవ్వడంలో తప్పు లేదని సెటైర్ వేశారు. బెయిల్ కోసం ప్రత్యేక హోదా(Speciala status) తాకట్టు పెట్టడానికి ఢిల్లీ(Delhi) వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘16 నెలలు చిప్పకూడు తినడం వలన శరీరం మందపడింది. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయ సాయిరెడ్డి పులిగా ఫీల్ అవ్వడంలో తప్పు లేదు. బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉంది. అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ. నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెఢీ. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్‌గా రావాలి. అప్పుడు తేలిపొద్ది ఎవడు పులో ఎవడు పిల్లో!’’ అని ట్వీట్లో అయ్యన్న పేర్కొన్నారు.