వ్యవసాయ శాఖకు అవార్డు

ABN , First Publish Date - 2022-12-16T01:32:35+05:30 IST

అగ్రికల్చర్‌ టుడే గ్రూప్‌ ఢిల్లీలో నిర్వహించిన 13వ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ - 2022లో పాలసీ లీడర్‌షిప్‌ కేటగిరిలో అవార్డు గెలుచుకున్న ఏపీ వ్యవసాయ శాఖ అధికారులను సీఎం జగన్‌ అభినందించారు.

వ్యవసాయ శాఖకు అవార్డు

అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): అగ్రికల్చర్‌ టుడే గ్రూప్‌ ఢిల్లీలో నిర్వహించిన 13వ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ - 2022లో పాలసీ లీడర్‌షిప్‌ కేటగిరిలో అవార్డు గెలుచుకున్న ఏపీ వ్యవసాయ శాఖ అధికారులను సీఎం జగన్‌ అభినందించారు. గురువారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎంను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ శేఖర్‌బాబు కలిసి రాష్ట్రానికి వచ్చిన అవార్డును చూపించారు. గత మూడున్నరేళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో విధానాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించినట్లు సీఎంకు అధికారులు వివరించారు.

Updated Date - 2022-12-16T01:32:36+05:30 IST