Doctorate: గజేంద్రసింగ్‌ షెకావత్‌‌కు డాక్టరేట్‌ ప్రదానం

ABN , First Publish Date - 2022-11-16T20:29:17+05:30 IST

వ్యవసాయవర్సిటీల, శాస్త్రవేత్తల బృందం కృషి ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఆహార ధాన్యాలు, వివిధ పంటల ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతున్నామని కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ (Gajendra Singh Shekhawat) తెలిపారు.

Doctorate: గజేంద్రసింగ్‌ షెకావత్‌‌కు డాక్టరేట్‌ ప్రదానం

తిరుపతి: వ్యవసాయవర్సిటీల, శాస్త్రవేత్తల బృందం కృషి ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఆహార ధాన్యాలు, వివిధ పంటల ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతున్నామని కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ (Gajendra Singh Shekhawat) తెలిపారు. జూన్‌ నెలలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ నిర్వహించిన స్నాతకోత్సవంలో షెకావత్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకోవాల్సింది. అయితే ఈ స్నాతకోత్సవానికి ఆయన హాజరు కానందున బుధవారం తిరుపతి (Tirupati)లోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ఆడిటోరియంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో నిర్వహించిన చర్చాగోష్టి కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి, వీసీ డాక్టర్‌ విష్ణువర్ధన రెడ్డి చేతుల మీదుగా కేంద్రమంత్రికి గౌరవ డాక్టరేట్‌ (Doctorate)ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మనం సాధించిన ప్రగతికి ప్రపంచదేశాలు ఆహారఉత్పత్తుల కోసం మనదేశం వైపు చూసేలా చేసిందని తెలిపారు.

Updated Date - 2022-11-16T20:29:19+05:30 IST