రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?: Atchennaidu

ABN , First Publish Date - 2022-06-24T17:54:45+05:30 IST

మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?: Atchennaidu

అమరావతి : మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Atchennaidu) పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ(YCP Government) అక్రమాలను ప్రశ్నిస్తే చంపేందుకు కూడా వెనకాడటం లేదని అచ్చెన్న పేర్కొన్నారు. అధికారపార్టీ అరాచకాలకు పోలీసులు ఎంతలా వత్తాసు పలుకుతున్నారో ఈ ఘటనే నిదర్శనమన్నారు. మహిళను పోలీసులు జీపుతో తొక్కించారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. బాధితులపైనే తిరిగి కేసులు పెట్టి బెదిరించాలనుకోవడం దుర్మార్గమన్నారు. వైసీపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పోలీసులు ఎంతకైనా దిగజారుతున్నారని వాపోయారు. పోలీసుల భుజాలపై తుపాకీ పెట్టి టీడీపీని బెదిరించాలనుకోవడం సరికాదన్నారు. ఘటనపై పోలీసు శాఖ స్పందించాలన్నారు. రూల్స్‌కు వ్యతిరేకింగా వెళ్లినవారికి ఇబ్బందులు తప్పవని.. చర్యకు ప్రతిచర్య ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు.

Updated Date - 2022-06-24T17:54:45+05:30 IST