-
-
Home » Andhra Pradesh » assembly Atchannaidu-MRGS-AndhraPradesh
-
ఏపీ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతాం: అచ్చెన్న
ABN , First Publish Date - 2022-03-06T00:49:41+05:30 IST
మాజీమంత్రి వివేకా హత్య కేసు, అమరావతిపై కోర్టు తీర్పు, నిరుద్యోగం, ఏపీ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతామని టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు ప్రకటించారు.

అమరావతి: మాజీమంత్రి వివేకా హత్య కేసు, అమరావతిపై కోర్టు తీర్పు, నిరుద్యోగం, ఏపీ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతామని టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే అసెంబ్లీకి హాజరుకావాలని టీడీపీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. టీడీపీ సభ్యులు పారిపోతున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. గతంలో అసెంబ్లీ నుంచి వైసీపీ పారిపోయిన విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. ప్రజాసమస్యలను ప్రస్తావిస్తే మైక్‌లు ఆపేసే సంస్కృతి వైసీపీదని తప్పుబట్టారు. సమావేశాల నుంచి పారిపోవాల్సిన అవసరం లేదని అచ్చెన్నాయుడు చెప్పారు.