కొడాలి నాని, వంశీ ప్రొగ్రెస్ రిపోర్ట్ CM దగ్గర బాగోలేదు: Ashok Babu
ABN , First Publish Date - 2022-06-09T21:34:51+05:30 IST
టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Amaravathi: టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు (Ashok Babu) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం.. సీఎం ఫేక్ అని తాము చెబుతూనే ఉన్నామన్నారు. లోకేష్ (Lokesh) జూమ్ కార్యక్రమం నిర్వహిస్తే వైసీపీ నేతలు ఫేక్ ఐడీలతో జొరబడ్డారని మండిపడ్డారు. నాని, వంశీ ప్రొగ్రెస్ రిపోర్ట్ సీఎం దగ్గర బాగోలేదన్నారు. సీఎం దగ్గర మార్కులు వేయించుకోవాలని జూమ్‌లో జొరబడ్డారన్నారు. జూమ్‌లోకి జొరబడడం ద్వారా సీఎం దగ్గర మార్కులు పడొచ్చేమో కానీ.. ప్రజలు ఉమ్మేస్తున్నారన్నారు. కొడాలి నాని.. వంశీలకు దమ్ముంటే వాళ్ల నియోజకవర్గాల్లో పదో తరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులు, పేరెంట్సుతో సమావేశం పెట్టాలని అశోక్ బాబు సవాల్ చేశారు.