ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-05T13:31:08+05:30 IST

అరుణాచల్‌ప్రదేశ్‌లో సుబ్బమ్మపేట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ కోనారి ధర్మారావు (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం

ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

శ్రీకాకుళం: అరుణాచల్‌ప్రదేశ్‌లో సుబ్బమ్మపేట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ కోనారి ధర్మారావు (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ధర్మారావు గత కొంతకాలంగా ఆర్మీ జవానుగా పనిచేస్తున్నారు. ఇటీవల సెలవులపై గ్రామానికి వచ్చాడు.కుటుంబసభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపాడు. వారం రోజుల కిందటే ఇంటి నుంచి వెళ్లి విధుల్లో చేరాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆర్మీ అధికారుల నుంచి ఆదివారం సాయంత్రం కుటుంబసభ్యులకు సమాచారమందింది. సోమవారం ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అందించారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య పార్వతితో పాటు కుమారులు కార్తీక్‌, తరుణ్‌, తల్లిదండ్రులు సాయమ్మ, సూరయ్యలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read more