డిప్యూటీ కలెక్టర్ల నోషనల్ పదోన్నతులకు ఆమోదం
ABN , First Publish Date - 2022-01-21T08:24:47+05:30 IST
డిప్యూటీ కలెక్టర్ల నోషనల్ పదోన్నతులకు ఆమోదం
అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ల నోషనల్ పదోన్నతులను ఆమోదించాలన్న స్ర్కీనింగ్ కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు 1992-93 నుంచి 2014 వరకు నోషనల్ పదోన్నతులు పొందిన డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీని ధ్రువీకరించారు. ఈ మేరకు వారికి స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులను ఖరారు చేసేందుకు మార్గం సుగుమం చేశారు. ఇప్పుడు ఈ కేటగిరీలోనూ వారికి సీనియారిటీని ఖారారు చేయడంతో వారికి త్వరలో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీని తాజా పరుస్తూ రెవెన్యూశాఖ మరో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.