-
-
Home » Andhra Pradesh » Applications for Best Teacher Awards-NGTS-AndhraPradesh
-
ఉత్తమ టీచర్ అవార్డులకు దరఖాస్తులు
ABN , First Publish Date - 2022-08-17T07:49:57+05:30 IST
ఉత్తమ టీచర్ అవార్డులకు దరఖాస్తులు

అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): గురుపూజోత్సవం రోజున ఉపాధ్యాయులకు వివిధ కేటగిరీల్లో ఇచ్చే ఉత్తమ టీచర్ అవార్డులకు పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. హెడ్ మాస్టర్, స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ, ఎస్జీటీ, పీఈటీ, పండిట్లు, క్రాఫ్ట్, సంగీతం విభాగాల్లో అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకోసం జిల్లా స్థాయిల్లో కమిటీలను నియమించింది. ఈనెల 20 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, 26న ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారని వివరించింది.