పాలకొల్లు టు అసెంబ్లీ!

ABN , First Publish Date - 2022-03-05T08:11:27+05:30 IST

పేద ల సొంతింటి కలను నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను..

పాలకొల్లు టు అసెంబ్లీ!

 ఎమ్మెల్యే నిమ్మల సైకిల్‌ యాత్ర 

పాలకొల్లు రూరల్‌/భీమవరం, మార్చి 4: పేద ల సొంతింటి కలను నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్‌ చేస్తూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. పాలకొల్లు టిడ్కో ఇళ్ల నుంచి అమరావతి అసెంబ్లీ వరకు సైకిల్‌ యాత్రకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. లబ్ధిదారుల ఆవేదనను తెలియజేసేందుకు, ఈ సమస్యను అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావించడానికి సైకిల్‌పై వెళుతున్నట్టు తెలిపారు.

Read more