ప్రైవేటు ‘లేఅవుట్ల’పై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2022-03-05T08:07:19+05:30 IST
ప్రైవేటు లేఅవుట్లలో 5శాతం స్థలాన్ని వైఎ్‌సఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకు కేటాయించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ...
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు లేఅవుట్లలో 5శాతం స్థలాన్ని వైఎ్‌సఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకు కేటాయించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ను ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది. ఆ కౌంటర్‌ను పరిశీలించిన తరువాత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ప్రైవేటు లేఅవుట్లలో 5శాతం స్థలాన్ని వైఎ్‌సఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్ట్‌కు కేటాయించాలంటూ ప్రభుత్వం జారీచేసిన జీవో 145ని సవాల్ చేస్తూ విశాఖపట్నానికి చెందిన ప్రకృతి ఎవెన్యూస్ మేనేజింగ్ పార్ట్‌నర్ మేడికొండూరి లక్ష్మీ శకుంతలాదేవి పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ప్రైవేటు లేఅవుట్ల యజమానులు 5శాతం స్థలాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నారు. అక్కడ ఇవ్వలేకపోతే 3కిలోమీటర్ల దూరంలో 5శాతం స్థలం లేదా స్థలం మూలవిలువ చెల్లించాలని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.