కురుపాం ఘటనకు సీఎందే బాధ్యత: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-03-05T08:01:50+05:30 IST
కురుపాంలో జరిగిన ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ..
అమరావతి: కురుపాంలో జరిగిన ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్ధులు.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. కాగా, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సొంత నియోజకవర్గం కురుపాంలో హాస్టల్ విద్యార్ధులు పాముకాటుకు గురికావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం.ధారునాయక్ ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ, పుష్పశ్రీవాణి పదవికి రాజీనామా చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.