తెలుగు విద్యార్థులకు తానా స్కాలర్‌షిప్పులు

ABN , First Publish Date - 2022-03-05T08:00:01+05:30 IST

అమెరికాలో గ్రాడ్యుయేట్‌ చదువుతున్న 22 మంది తెలుగు విద్యార్థులకు తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) ఫౌండేషన్‌...

తెలుగు విద్యార్థులకు తానా స్కాలర్‌షిప్పులు

 తొలివిడత 22 మందికి అందజేత

అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో గ్రాడ్యుయేట్‌ చదువుతున్న 22 మంది తెలుగు విద్యార్థులకు తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్పులు అందించింది.  గురువారం డల్లా్‌సలో జరిగిన ఈ కార్యక్రమంలో  తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ యార్లగడ్డ వెంకటరమణ, సభ్యులు పోలవరపు శ్రీకాంత్‌, తోటకూర ప్రసాద్‌ మురళి వెన్నం తదితరులు పాల్గొన్నారు. ఆయా యూనివర్సిటీల్లో ఫీజును బట్టి ఒక్కో విద్యార్థికి సగటున వెయ్యి డాలర్ల  స్కాలర్‌షిప్పుగా ఇవ్వనున్నట్లు చైర్మన్‌ తెలిపారు. భవిష్యత్తులో మొత్తం వంద మందికి స్కాలర్‌షిప్పు అందించేందుకు కృషి చేస్తామన్నారు.   స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్థులు జీవితంలో స్థిరపడ్డాక పౌండేషన్‌ ద్వారా మరికొంతమందికి అండగా నిలావాలని ఆకాంక్షించారు. కాగా, తానా ఫౌండేషన్‌లో కొత్తగా వందమంది దాతలు చేరారని, తద్వారా మిలియన్‌ డాలర్లు సమాకూరాయని, తానా ఫౌండేషన్‌ చరిత్రలో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు.

Read more