49 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారు

ABN , First Publish Date - 2022-03-05T07:52:21+05:30 IST

వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారని సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు...

49 మంది వైసీపీ ఎమ్మెల్యేలు  వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారు

9 మంది ఎంపీలు కూడా..

జగన్‌ సినిమా అయిపోయింది 

ఇక 3 రాజధానులతో 

ఎన్నికలకు వెళ్తారు 

ఓటుకు రూ.50 వేలు ఇచ్చినా 

వైసీపీ గెలిచే పరిస్థితి లేదు: శివాజీ

 

వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారని సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటించి, దీక్షా శిబిరాల్లో ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. మందడంలో శివాజీ ప్రసంగించారు. జగన్‌ సినిమా మొత్తం అయిపోయిందని, ఇక 3రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సీఎం తన స్థానాన్ని గెలుచుకోవడానికే గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుందన్నారు. వివేకా ఉంటే జగన్‌కు విజయం కొంచెం సులువయ్యేదన్నారు. ఓటుకు రూ.50వేలు ఇచ్చినా ఈసారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. ఈ కాలంలో కూడా కులంగురించి ఎందుకు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలను ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. 

Read more