చంద్రబాబు చేతిలో సునీత పావు!

ABN , First Publish Date - 2022-03-02T08:00:24+05:30 IST

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను ఆయన కుమార్తె సునీత పెద్దదిగా చూపే ప్రయత్నం చేస్తోందని.. ....

చంద్రబాబు చేతిలో సునీత పావు!

 వివేకా హత్యను ఆమె పెద్దది చేసి చూపుతోంది: సజ్జల

అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను ఆయన కుమార్తె సునీత పెద్దదిగా చూపే ప్రయత్నం చేస్తోందని.. ఆధారంలేని ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివేకా హత్యకు సంబంధించి రోజువారీ ఆరోపణలు, సీబీఐ విచారణ పేరిట వస్తున్న కథనాలను చూస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వైపు వేలెత్తి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు డైరెక్షన్‌లో.. ఆయన నడుపుతున్న స్ర్కిప్టు మేరకే ఉంటోందని అన్నారు. ఈ వ్యవహారమంతా పరిశీలిస్తుంటే వివేకా కుమార్తె సునీత.. చంద్రబాబు చేతిలో పావుగా మారారని అనిపిస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆమె టీడీపీ తరఫున పోటీ చేస్తుందన్న అభిప్రాయం కలుగుతోందన్నారు. చనిపోయిన వివేకానందరెడ్డి ఆత్మ క్షోభించేలా సునీత వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని టీడీపీ నేతలు అంటున్నారని.. కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే కన్ను పొడుచుక్నుట్లు ఉంటుంది కాబట్టే జగన్‌ మాట్లాడలేదని చెప్పారు. కానీ.. కుటుంబ సభ్యులే దీన్ని పెద్దది చేసి చూపుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇవన్నీ వ్యక్తిగతమైనవో లేదంటే ఆర్థిక పరమైనవో, కుటుంబ పరమైనదో కావొచ్చని సజ్జల ఆరోపిం

Updated Date - 2022-03-02T08:00:24+05:30 IST